గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (09:32 IST)

ఢిల్లీలో కరోనా విజృంభణ.. 7,802 కేసులు నమోదు.. 91 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 7,802 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 91 మంది మృతి చెందారు. వరుసగా రెండవ రోజు కరోనాతో 90 మంది మృతి చెందారు. ఇకపోతే.. గడిచిన 24 గంటల్లో 6,462 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,74,830గా ఉంది. వీరిలో 4,23,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో మొత్తం 7,423 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం 44,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 26,741 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీలో మొత్తం 53,78,827 కరోనా టెస్టులు చేశారు.