ప్రొఫెసర్ వేధిస్తున్నాడని చెప్పినా పట్టించుకోరా? కాలేజీలో నిప్పంటించుకున్న యువతి (Video)
మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా కాలేజీలో పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే విద్యార్థినిపై కన్నేశాడు. లైంగిక కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేశాడు. కాలేజే ప్రొఫెసర్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని కాలేజీలోనే నిప్పంటుకుంది. ఈ ఘటన కలకలం రేపింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు షాక్ అయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఒక స్టూడెంట్‌కు కూడా మంటలంటుకున్నాయి. ఇద్దరిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు వారిని తరలించారు.
కాగా, ఈ సంఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు సమీర్ కుమార్ సాహును అరెస్ట్ చేశారు.
ప్రొఫెసర్ వేధిస్తున్నాడని ఎంత చెప్పినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోక పోవడంతో బాధితురాలు మిగతా స్టూడెంట్స్‌తో కలిసి ప్రిన్సిపాల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. అయితే ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుందని పోలీసులు తెలిపారు.