శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 ఫిబ్రవరి 2025 (08:50 IST)

భాజపా దూకుడు, బీజెపి-26, ఆప్-16: వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్

kejriwal
Delhi Assembly results ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకువెళుతోంది. ఆ పార్టీ 26 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుండగా ఆప్ కేవలం 16 చోట్ల ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల ముందంజలో వుంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో వున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుండి అరవింద్ కేజ్రీవాల్, భారతీయ జనతా పార్టీ (BJP) నుండి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, భారత జాతీయ కాంగ్రెస్ (INC) నుండి సందీప్ దీక్షిత్ వంటి కీలక అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
 
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), BJP మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తాము తిరిగి అధికారంలోకి వస్తామని, అరవింద్ కేజ్రీవాల్ నాల్గవసారి ముఖ్యమంత్రి అవుతారని AAP ధీమా వ్యక్తం చేసింది. కానీ అగ్ర నాయకులు, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రి అతిషి తమ తమ స్థానాల్లో వెనుకబడి ఉన్నారని ప్రారంభ ధోరణులు సూచిస్తున్నాయి.