శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (12:58 IST)

సీఎంకు ఒంటెను కానుకగా ఇచ్చిన కార్యకర్తలు- కూటమికి స్టాలిన్‌ షాక్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని డీఎంకే కార్యకర్తలు ఒంటెను బహుమతిగా ఇచ్చారు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు చెన్నైలోని తమ ప్రధాన కార్యాలయంలో రెండేళ్ల వయసున్న ఒంటెను బహూకరించారు. ప్రస్తుతం స్టాలిన్‍‌కు ఒంటెను బహమతిగా ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
మరోవైపు తన 70వ  జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డీఎంకే అధ్యక్షులు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
 
థర్డ్ ఫ్రంట్ ఆలోచనలను తిరస్కరించారు. అంతేగాకుండా.. కాంగ్రెస్‌ లేకుండా కూటమిని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం అర్దరహితం అంటూ స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
బీజేపీని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నిలబడాలని కూడా స్టాలిన్ పిలుపునిచ్చారు.  జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత కోరుతూ స్టాలిన్ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.