సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (20:19 IST)

ఏడువేల మంది ఉద్యోగులను తొలగించనున్న మెటా?

ఫేస్‌బుక్ ఇటీవల 11వేల మందిని తొలగించగా, దాని మాతృ సంస్థ మెటా ఏడు వేల మంది ఉద్యోగులను తొలగించబోతోంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం సహా పలు కారణాల వల్ల ప్రముఖ కంపెనీలు ఉద్యోగాల కోత దిశగా అడుగులు వేస్తున్నాయి. 
 
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా పలు కంపెనీలు గత జనవరి నుంచి రెండు నెలల్లో లక్షకు పైగా ఉద్యోగాలను తొలగించాయి. 
 
ఇప్పటికే చాలా దేశాలు నిరుద్యోగంతో సతమతమవుతున్నాయని, దీంతో నిరుద్యోగ యువత సంఖ్య పెరిగిందన్నారు. ఈ స్థితిలో ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటాకు చెందిన 7000 మంది ఉద్యోగులను తొలగించనున్నామని, త్వరలోనే ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.