శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (18:08 IST)

మెకానిక్ మంచి విజయం సాధించాలి: దిల్ రాజు

dilraju launch mekanic poster
dilraju launch mekanic poster
మణి సాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న "మెకానిక్" చిత్రం మోషన్ పోస్టర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలుపుతూ, మెకానిక్ మంచి విజయం సాధించాలని అన్నారు. 
 
టేనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగ మునెయ్య) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్ - నందిపాటి శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం "మెకానిక్". "ట్రబుల్ షూటర్" అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా "ముని సహేకర" దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో... వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది. మణి సాయి తేజ సరసన రేఖ నిరోషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది.
 
తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్  దొరబాబు, కిరీటి దామరాజు,  బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సంగీతం: వినోద్ యాజమాన్య, సింగర్స్: సిడ్ శ్రీరామ్, కైలాష్ ఖేర్, ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం.