ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (21:43 IST)

ఈ ప్రేమికుల దినోత్సవ వేళ, బాదములతో ప్రేమ, ఆరోగ్యంను బహుమతిగా అందించండి

Almonds
ప్రేమికుల దినోత్సవం సమీపిస్తోంది. మీరు అభిమానించే వారికి ఖచ్చిమైన బహుమతిని అందించడం కోసం ఆలోచించడం ప్రారంభించండి. పూలు, చాక్లొట్లు వంటివి సంప్రదాయ ఎంపికలైతే, ఈ సంవత్సరం కేవలం మీ ప్రేమ, అభిమానం మాత్రమే చూపడం కాదు చక్కటి ఆరోగ్యం, వెల్‌నెస్‌ను సైతం ప్రోత్సహించండి. బాదములలో  పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మీ ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఆలోచనాత్మకమైన, వినూత్నమైన బహుమతులను అందించండి
 
బాదములలో అత్యంత సహజసిద్ధమైన 15 పోషకాలు అయిన జింక్‌, ఫోలేట్‌, ఐరన్‌, విటమిన్‌ ఈ , మెగ్నీషియం, ప్రోటీన్‌ మొదలైనవి ఉన్నాయి. ఇవి పలు ఆరోగ్య ప్రయోజనాలను గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, బరువు నియంత్రణతో పాటుగా బ్లడ్‌ షుగర్‌ నిర్వహణలోనూ అందిస్తాయి. అందువల్ల, ఈ ప్రేమికుల దినోత్సవ వేళ, మీ ప్రేమ- అభిరుచిని ఆలోచనాత్మకం, ఆరోగ్యవంతమైన బహుమతితో చూపండి. మీ ప్రియమైన వారు తప్పనిసరిగా మీ బహుమతిని అభిమానించడంతో పాటుగా బాదములు అందించే ఆరోగ్య ప్రయోజాలతో ఆనందిస్తారు.
 
సుప్రసిద్ధ భారతీయ టెలివిజన్‌, సినీ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ, ‘‘నా జీవితంలో ప్రేమికుల దినోత్సవానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంది. ఈ రోజున మా శ్రీవారు మరింత ఎక్కువగా ప్రేమను చూపాలనుకుంటారు. నా పక్కనే ఉండాలనుకుంటారు. ఈ ప్రేమ దినోత్సవాన్ని వేడుక చేస్తూ, నేను సాధారణంగా మా ఇంటిలోనే క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ ప్రణాళిక చేస్తుంటాను. నేను స్వయంగా వండుతాను. మేము ఏమి తింటున్నామో అది ఆలోచనాత్మకంగా ఉండటం చేత ఈ సంవత్సరం నేను ఆల్మండ్‌ అమరంత్‌ కెబాబ్‌‌ను మెయిన్‌ కోర్సులో, బాదము పాలు మౌస్సీని స్వీట్‌ గా తయారుచేయాలనుకుంటున్నాను. బాదములలో ఆకలి తీర్చే గుణం ఉంది. కడుపు నిండిందన్న భావన కలుగుతుంది. మొత్తంమ్మీద ఆకలిని అతి తక్కువగా ఉండేలా చేస్తుంది. మన ఆరోగ్యవంతమైన లక్ష్యాలకు మద్దతు అందించేందుకు ఎంపిక చేసుకోతగ్గ ఆహారంగా నిలుస్తుంది. అదనంగా, క్రమం తప్పకుండా బాదములు తింటే అది చర్మ ఆరోగ్యం మెరుగుపడటానికి సైతం తోడ్పడుతుంది. దీనిలో ఆరోగ్యవంతమైన కొవ్వులు, విటమిన్‌ ఈ ఉంది. ఇవి యాంటీ ఏజింగ్‌ లక్షణాలను సైతం ప్రదర్శిస్తాయి’’ అని అన్నారు.
 
న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘ ప్రేమికుల దినోత్సవ వేళ, మనకు బహుమతులను ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. కానీ నేను మాత్రం మీ ప్రియమైన వారికి  ఆరోగ్యం అందించే అవకాశాలను ఎంచుకోవడానికే ఇష్టపడతాను. ప్రేమికుల దినోత్సవ వేళ బహుమతులను మార్చుకోవడం తప్పనిసరి, అయితే మనం ఏమి జోడిస్తున్నామనే దానిపై ఆలోచనాత్మకంగా ఉండాలి. దీనికోసం నేను అయితే మన ప్రియమైన వారికి దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగించే బహుమతులు ఎంచుకుంటాను. వాటిలో బాదములు కూడా ఒకటి. బాదములు రుచికరమైన, ఆరోగ్యవంతమైన స్నాక్‌. ఇవి అత్యుత్తమ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
 
నిజానికి, పరిశోధనలు చూపేదాని ప్రకారం ప్రతిరోజూ 42 గ్రాముల బాదములు తింటే, కడుపు వద్ద కొవ్వు కరగడంతో పాటుగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదములను క్రమంతప్పకుండా తినడం వల్ల అతి తక్కువ కొలెస్ట్రాల్‌ స్థాయిలు చేరడంతో పాటుగా చెడు ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌, బ్లడ్‌ షుగర్‌ స్థాయి సైతం నిర్వహించడం సాధ్యమవుతుంది. అదే సమయంలో హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయి పెరగడం, రోగ నిరోధక శక్తి మెరుగుపడటం, బరువును అత్యుత్తమంగా నిర్వహించడమూ వీలవుతుంది. అదనంగా, వీరు సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన స్నాక్‌ను తినవచ్చు. దీనిని ఏ సమయంలో అయినా ఎక్కడైనా ఆస్వాదించవచ్చు. బాదములు ఆలోచనాత్మకమైనవి మరియు ఆరోగ్యవంతమైన బహుమతి. దీనిని మీ ప్రియమైన వారు సంవత్సరమంతటా ఆస్వాదించవచ్చు’’ అని అన్నారు.
 
వాలెంటైన్స్‌ డే డెస్సర్ట్స్‌లో బాదముల యొక్క చక్కదనం జోడించడం గురించి చెఫ్‌ శరన్ష్‌ గోయిలా మాట్లాడుతూ, ‘‘వాలెంటైన్స్‌ డే డెస్సర్ట్స్‌లో బాదములను జోడించడమనేది మీ ప్రియమైన వారికి మీరు వారిని ఎంతగా అభిమానిస్తున్నారో వెల్లడించేందుకు మార్గం. వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త, వారికి అందించే ఆహారం రుచికరంగా చేయాలన్న తపన కూడా అది చూపుతుంది. బాదములలో జింక్‌, ఐరన్‌, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఆహారాన్ని రుచికరంగా బాదములు మార్చడంతో పాటుగా ఎలాంటి డిష్‌కు అయినా నట్టీ ఫ్లేవర్‌ను అందిస్తాయి. బాదములలో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తిని అది అందిస్తుంది. అంతేకాదు ఎదుగుదల, మజిల్‌ మాస్‌కు సైతం తోడ్పడుతుంది. బాదముల ఆరోగ్య ప్రయోజనాలను మనసులో ఉంచుకుంటే, ఈ సంవత్సరం, నేను ఈ ప్రేమికుల దినోత్సవ వాలెంటైన్‌ డెసర్ట్‌గా ఆల్మండ్‌ చాక్లొట్‌ ట్రఫెల్‌ చేస్తాను. దీనిని తయారుచేయడం సులభం, బాదముల చక్కదనం జోడించబడుతుంది. అందువల్ల ఈ ప్రేమికుల దినోత్సవ వేళ బాదములను జోడించి ప్రేమతో వండండి’’ అని అన్నారు.