శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (17:39 IST)

ఓవైపు పెళ్లి.. మరోవైపు గుట్కా నములుతున్న వరుడు.. చెంప పగులగొట్టిన వ‌ధువు

పెళ్లి అనేది ఓ పవిత్రమైన కార్యం. పెళ్లి పీటలెపై కూర్చొనే వధూవరులు అంతే పవిత్రంగా ఈ పెళ్లిను చేసుకోవాలని భావిస్తారు. అయితే, ఇటీవలి కాలంలో కొంతమంది పెళ్లి కుమారులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పీకల వరకు మద్యం సేవించడం, గుట్కాలు, పాన్ పరాగ్‌లు, కిళ్లీలు నములుతూ దర్జాగా వచ్చి పెళ్లి పీటలపై కూర్చొంటున్నారు.
 
ఇక్కడో పెళ్లి కుమారుడు నోట్లో గుట్కా వేసుకొని న‌ములుతూ పూజారి చెప్పుతున్న మంత్రాల‌ను చ‌దువుతున్నాడు. ఈ విష‌యం గ‌మ‌నించిన వ‌ధువు.. వ‌రుడి చెంప చెళ్లుమ‌నిపించింది. దీంతో వెంట‌నే పైకి లేచి.. ప‌క్క‌నే గుట్కాను మొత్తం ఉమ్మేశాడు. 
 
ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అది.. అటువంటి వాళ్ల‌కు అలాగే బుద్ధి చెప్పాలి. శేభాష్.. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు మామూలు తెలివైంది కాదు.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. పనిలోపనిగా పూజారి చెంప కూడా