శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (16:54 IST)

దినకరన్ భార్య అనురాధను కూడా వదిలిపెట్టని ఢిల్లీ పోలీసులు.. ప్రత్యేక గదిలో?

అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల చిహ్నం కోసం ఈసీకి లంచం కేసులో జయమ్మ నెచ్చెలి, చిన్నమ్మ బంధువు టీటీవీ దినకరన్‌‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దినకరన్ వద్ద విచారణ జరుగుతోంది. ఇదే కేసులో

అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల చిహ్నం కోసం ఈసీకి లంచం కేసులో జయమ్మ నెచ్చెలి, చిన్నమ్మ బంధువు టీటీవీ దినకరన్‌‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దినకరన్ వద్ద విచారణ జరుగుతోంది. ఇదే కేసులో దినకరన్ సతీమణి అనురాధను కూడా ఢిల్లీ పోలీసులు వదిలేట్టు లేరు.
 
అనురాధను విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్న దినకరన్‌తో పాటు చెన్నై వచ్చిన ఢిల్లీ పోలీసులు.. హవాలా ఆర్థిక లావాదేవీలను చూసుకునే అనురాధ వద్ద విచారణ జరిపారు. పోలీసుల విచారణలో కొన్ని ప్రశ్నలకు అనురాధ సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. దినకరన్ ఎంత వేడుకున్నా.. అనురాధను పోలీసులు ప్రత్యేక గదిలో ఉంచి విచారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అనురాధ కూడా పోలీసులకు దొరికిపోతుందేమోనని మన్నార్గుడి ఫ్యామిలీ జడుసుకుంటోంది. 
 
కాగా.. రెండాకుల చిహ్నం కోసం ఏకంగా ఎన్నికల యంత్రాగానికికే రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ టీటీవీ దినకరన్, అతని అనుచరుల మీద కేసు నమోదు అయ్యింది. బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్‌తో సహ టీటీవీ దినకరన్, మల్లికార్జున తదితరులు ఇప్పటికే అరెస్టు అయ్యారు.