సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:57 IST)

వర్షంతోపాటు బంగారు నాణేలు.. ఎక్కడ?

కర్నాటక-తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన సర్జాపుర, బాగలూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే ఆ వర్షం తోపాటు బంగారు నాణేలు కూడా కురిశాయని ఆ ప్రాంతంలో వదంతులు వినిపించాయి.

దీంతో ప్రజలంతా రోడ్లమీదకు వచ్చి వెతుకులాట ప్రారంభించారు. ఉర్ధూ అక్షరాలు చెక్కి ఉన్న వంద నాణేల వరకు స్థానికులకు దొరికాయి. దీంతో ప్రజలు మరింత ఆశతో రోడ్లపైన, ఖాళీ ప్రదేశాల్లో నాణేల కోసం వెతుకులాట ప్రారంభించారు.

ఈలోపు విషయం తెలుసుకున్న పోలీసులు ప్రజలకు దొరికిన నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి బంగారు నాణాలు అయి ఉండవని పోలీసులు చెబుతున్నారు.

ఎవరో ఈ నాణేలను భూమిలో దాచుకొని ఉంటారని, భారీ వర్షానికి బురదతోపాటు కొట్టుకొని వచ్చి ఉంటాయని పోలీసులు అంటున్నారు. కానీ ప్రజలు మాత్రం ఆశ చావక రొడ్లమీదకు వచ్చి వెతుకుతూనే ఉన్నారు.