శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

గుజరాత్ నవరాత్రి ఉత్సవాల్లో విషాదం... గర్బా నృత్యం చేస్తూ 10 మంది మృతి

deadbody
గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. గర్బా నృత్యం చేస్తూ ఏకంగా పది మంది చనిపోయారు. వీరిలో యుక్త వయస్కుల వారి నుంచి మధ్య వయసువారు ఉన్నారు. శుక్రవారం అహ్మదాబాద్‌కు చెందిన 24 యేళ్ళ యువకుడు ఒకడు శుక్రవారం గర్బా నృత్యం చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, కపద్వాంజ్‌కు చెందిన 17 యేళ్ల బాలుడు గర్బా ఆడుతూ మృతి చెందుడూ గడిచిన రోజులో ఇలాంటి కేసులు వరుసగా నమోదయ్యాయి. 
 
దీనికితోడు నవరాత్రుల మొదటి ఆరు రోజులలో 108 అత్యవసర అంబులెన్స్ సేవలకు గుండె సంబంధిత సమస్యల కోసం 521 కాల్స్, శ్వాస ఆడకపోవడం కోసం అదనంగా 609 కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్ సాధారంగా గర్బా వేడుకలు జరిగే సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 2 మధ్య వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఆందోళనకరమైన ధోరణి, ప్రభుత్వం, ఈవెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గార్బా వేదికల సమీలంలో అన్ని ప్రభుత్వం ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.