గురువారం, 3 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (10:45 IST)

గుండెపోటుతో ఏడో తరగతి చదువుతున్న బాలిక మృతి.. దసరా సెలవులకు వచ్చి..?

heart stroke
ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరిగాయి. పిల్లలతో పాటు శారీరకంగా దృఢంగా ఉన్నవారిలోనూ గుండెపోటు వస్తోంది. ఇటీవల ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందడం విషాదాన్ని నింపింది. 
 
వివరాల్లోకి వెళితే.. కంజర గ్రామానికి చెందిన ఆదరంగి మైథిలి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. మైథిలీ అక్క గ్రేసీ కూడా అక్కడే ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.
 
దసరా సెలవుల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చింది. అదే రోజు రాత్రి తనకు ఛాతిలో నొప్పిగా ఉందని మైథిలి తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.