1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (09:39 IST)

కోవిడ్ భయం - మూడేళ్లుగా గదిలో బందీగా తల్లీ కుమారుడు.. ఎక్కడ?

kid rescue
కోవిడ్ వైరస్ సోకుతుందన్న భయంతో ఓ తల్లి తన బిడ్డతో కలిసి గత మూడేళ్లుగా తన ఇంటిలోని ఓ
గదిలో బందీగా మారిపోయింది. మూడేళ్లుగా వారిద్దరూ బయటకు రాకపోవడంతో ఆ గదంతా చెత్తా చెదారంతో నిడిపోయింది. అయితే, ఆమె భర్త తన భార్య ప్రవర్తనపై గతంలో ఒకసారి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు స్పందించలేదు. ఇపుడు మరోమారు ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు... శిశు సంరక్షణ బృందం అధికారులతో చాకచక్యంగా వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన  ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన 35 యేళ్ల మహిళ కోవిడ్ తొలి వేవ్ సమయంలో ఆ కుటుంబం ఇంటికే పరిమితమైంది. కోవిడ్ రెండో వేవ్ సమయంలో భర్తను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న ఆ మహిళ.. విధుల కోసం అతడు బయటకు వెళ్లి నతర్వాత ఇంటికి లోపలి నుంచి తాళం వేసుకుంది. దీంతో అతడు చక్కర్‌పూర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని గత యేడాదిన్నరకాలంగా ఉంటున్నాడు. 
 
తన భార్య ప్రవర్తనపై ఆయన గతంలో ఓసారి ఫిర్యాదు చేశారు. అయితే, అది భార్యాభర్తల విషయంగా భావించిన పోలీసులు జోక్యం చేసుకోలేదు. ఇపుడు మరోమారు ఫిర్యాదు చేయడంతో తన భార్యకు మతిస్థిమితం లేదని చెప్పడంతో పోలీసులు స్పందించి, శిశు సంరక్షణ బృందం అధికారులతో కలిసి తల్లీ కుమారుడిని రక్షించారు. ప్రస్తుతం వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక దశలో గదిలోకి ఎవరైనా వస్తే తన కుమారుడిని హత్య చేస్తానని బెదిరించింది. అయితే, పోలీసులు మాత్రం చాకచక్యంగా రక్షించారు.