సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (10:11 IST)

ఒకటో తరగతిలో చేర్చాలంటే ఆరేళ్లు నిండివుండాలి .. కేంద్రం

students
దేశంలో కొత్త జాతీయ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ఇక నుంచి ఒకటో తరగతిలో చేర్చాలంటే చిన్నారులకు ఆరేళ్లు నిండివుండాలన్న నిబంధన విధించింది. ఆరేళ్ల లోపు పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
 
జాతీయ విద్యా విధానం ప్రకారం 3 నుంచి 8వ వయసులో పిల్లకు ఫౌండేషన్‌లో దశలో భాగంగా, మూడేళ్లపాటు ప్రీ స్కూల్ విద్య, ఆ తర్వాత 1,2 తరగతులు ఉంటాయి. ప్రీస్కూలు నుంచి పిల్లలకు ఎలాంటి అవాంతరాలులేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించనున్నారు. ఇది జాతీయ నూతన విద్యా విధానం ముఖ్యోద్దేశాల్లో ఒకటి. ఇందులోభాగంగా ఆరేళ్లు నిండిన చిన్నారులకు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలని సూచన చేసింది.
 
ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రవేశ ప్రక్రియలో నిబంధనలు సవరించాలని కోరింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిదిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారు చేసేందుకు వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సులను రూపొందించి అమలు చేయాలని సూచించింది.