పఠాన్ పాటకు డ్యాన్స్.. ప్రొఫెసర్లతో చిందులేసిన షారూఖ్ ఖాన్
ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన లేడీ ప్రొఫెసర్లు పఠాన్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పంచుకున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్ల మైలురాయిని క్రమంగా చేరుకుంటోంది.
ఈ ఊపుతో షారుఖ్ ఖాన్ ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లతో చిందులేశాడు. "ఝూమే జో పఠాన్" అనే హిట్ పాటకు నృత్యం చేయడం ఈ వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియోలో ప్రొఫెసర్లు భారతీయ సాంప్రదాయ చీరలు ధరించి సరదాగా పాల్గొన్నారు. జీన్స్, టాప్స్‌లో ఉన్న అమ్మాయిలు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.