ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (18:13 IST)

సమోసాలకు సీరియర్ నంబర్.. ఎక్కడ?

పానీపూరి, సమోసాలు అంటే ఇష్టపడనివారుండరు. వీటి పేరు వింటేనే నోటిలో లాలాజలం ఊరుతుంది. అయితే, సమోసాలకు కూడా సీరియల్ నంబర్ ఇవ్వడం ఎక్కడైనా చూశారు. కానీ, ఢిల్లీలో ఓ వ్యక్తి ఆర్డరిచ్చిన సమోసాలపై సీరియల్ నంబర్‌తో సరఫరా చేయడం గమనార్హం. 
 
ఢిల్లీకి చెందిన నితిన్‌ మిశ్రా అనే వ్యక్తి ఓ దుకారణంలో సమోసాలకు ఆర్డరిచ్చాడు. దీంతో అతని ఇంటికి సమోసాలు సరఫరా అయ్యాయి. అయితే, వాటిపై క్రమ సంఖ్య ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఫొటోతో సహా ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారు. 
 
‘నేను ఆర్డర్ చేసిన సమోసాలపై సీరియల్ నంబర్లు ఉన్నాయి. టెక్ ప్లీజ్‌.. నా హల్వాయికి దూరంగా ఉండవా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు సమోసాలకు క్రమ సంఖ్య ఉన్న ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 
 
నెటిజన్లు దీనిపై పలు కామెంట్లు చేశారు. సమోసాలకు నంబర్ల విధానం కొనసాగడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, అవి ప్రముఖ ఈటరీ ‘సమోసా పార్టీ’కి చెందినవి అంటూ ఒకరు బదులిచ్చారు. ఆ ఈటరీ సమోసాలకు సీరియల్‌ నంబర్‌ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.