ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (17:24 IST)

ఉపాధి కోసం వచ్చిన మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

బీహార్ నుంచి ఉపాధి కోసం ఢిల్లీకి వచ్చిన మైనర్ బాలికపై ఓ ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
గత నెల 27వ తేదీన తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి 16 యేళ్ల మైనర్ బాలిక బీహార్ నుంచి ఉద్యోగం కోసం ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీ రైల్వే స్టేష‌న్‌కు చేరుకున్న ఈ బాలికను గ‌మ‌నించిన ర‌వికుమార్ (30) అనే ఆటో డ్రైవర్ మాట‌లు క‌లిపాడు. 
 
అద్దె కోసం కోసం ఇల్లు కావాల‌ని వారు కోర‌గా ఉద్యోగం కూడా ఇప్పిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికిన నిందితుడు త‌న ఆటోలో న్యూ అశోక్ న‌గ‌ర్‌లోని త‌న బంధువు ఇంటికి తీసుకువెళ్లాడు.
 
ఇంటికి కావాల్సిన వ‌స్తువుల‌ను తీసుకురావాల‌ని బాలిక బాయ్‌ఫ్రెండ్‌ను బ‌య‌ట‌కు పంపిన నిందితుడు ఒంట‌రిగా ఉన్న బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. బాలిక స్నేహితుడు తిరిగిరాగా బాధితురాలు ఏడుస్తూ జ‌రిగిన విష‌యం వెల్ల‌డించింది. 
 
తాము తిరిగి బీహార్ వెళ‌తామ‌ని వారు కోర‌గా ఆటోడ్రైవ‌ర్ వారిని న్యూఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో దింపాడు. జ‌రిగిన విష‌యం ఎవ‌రికైనా చెబితే తీవ్ర ప‌రిణామాలు ఎదురవుతాయ‌ని వారిని హెచ్చ‌రించాడు. 
 
అయితే, జరిగిన అన్యాయాన్ని తలచుకుని ఆ బాలిక కుమిలిపోతూ ఏడుస్తూ కనిపించింది. బాలిక ఏడుస్తుండ‌టంతో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీస్ వివ‌రాలు అడ‌గ్గా ఆటోడ్రైవ‌ర్ నిర్వాకం వెల్ల‌డించింది. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.