శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , మంగళవారం, 31 ఆగస్టు 2021 (15:00 IST)

ఏటీఎంలో క‌నిపించిన డ‌బ్బు... ఆటో డ్రైవర్ నిజాయితీ!

ఏటీఎంలో డ‌బ్బు డ్రా చేద్దామ‌ని ఆ ఆటో డ్రైవ‌ర్ వెళ్ళాడు... అక్క‌డ అంత‌కు ముందే డ‌బ్బు నోట్లు ఏటీఎం బ‌య‌ట‌కు వ‌చ్చి ఉన్నాయి. వాటిని చూసి, చ‌లించిపోయి... త‌ప్పు చేయ‌కుండా, ఆ ఆటో డ్రైవ‌ర్ త‌న నిజాయితీని ప్ర‌ద‌ర్శించాడు. డ‌బ్బు పోలీసుల‌కు అప్ప‌గించాడు. 
 
గుంటూరు జిల్లా మాచర్ల బస్సు స్టాప్ ప‌క్కన జియో ఆఫీస్ దగ్గర ఉన్న ఎటియంలోకి వీరాంజనేయులు అనే ఆటో డ్రైవర్ డబ్బు కోసం వెల్ళాడుర‌. ఏటీ మెషిన్ లో 9000 రూపాయ‌ల న‌గ‌దు కనిపించింది. అంతకు ముందు ఎటియంను ఆపరేట్ చేసిన వ్యక్తి డబ్బు రాలేదని వెళ్లిపోవడంతో, కొంత సేపటి తరువాత ఆ డబ్బు ఏటీఎం నుంచి బ‌య‌ట‌కు వచ్చి ఉండవచ్చు. దీనితో ఆ  డబ్బులు తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆటో డ్రైవ‌ర్ వీరాంజ‌నేయులు జరిగిన విషయం పోలీస్ వారికి తెలియజేశాడు. 
 
త‌న‌కు దొరికిన 9వేల రూపాయ‌ల న‌గ‌దును పోలీసుల‌కు అప్ప‌గించాడు. దీనితో పోలీసులు డ్రైవర్  వీరాంజనేయులును అభినందించారు. తరువాత పోలీసుశాఖ వారు ఎటియంలో డబ్బులు పోగొట్టుకున్నవారు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంప్రదించవలసిందిగా తెలియచేసారు.