హైదరాబాద్ లోని మౌలాలి లాలాపేటలో రైల్వే వేగన్ వర్క్ షాప్ లో రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు. రవివర్మ ఫైట్ మాస్టర్ నేత్రుత్వంలో రామ్ చరణ్ తోపాటు కొంతమంది ఫైటర్లు జనాల మధ్యలో చిత్రీకరణ జరుగుతోంది.
క్షణికావేశంలో పొరబాటుగా మాట్లాడాననీ, భారతిగారు కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతానంటూ ఐటిడిపి చేబ్రోలు కిరణ్ కుమార్ ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసాడు. పొరబాటున, క్షణికావేశంలో తప్పుగా మాట్లాడననీ, తనను జగన్ గారు, భారతి గారు మన్నించాలంటూ ఆ వీడియో ద్వారా అభ్యర్థించాడు. ఐతే కిరణ్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా సీరియస్ అయ్యింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
మరోవైపు కిరణ్ కుమార్ పైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఈ సమయంలో వైసిపి నాయకుడు గోరంట్ల మాధవ్ అక్కడికి చేరుకున్నారు. కిరణ్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. కిరణ్ అంతు చూస్తానంటూ బెదిరించారు.