గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జనవరి 2024 (17:29 IST)

కొత్త ఇల్లు.. గృహప్రవేశం చేసిన కొద్దిరోజులకే కూల్చేశారు.. ఎందుకు?

Pondicherry House
Pondicherry House
పుదుచ్చేరిలోని అట్టుపట్టి ప్రాంతంలో పలు ఇళ్లు కూలిపోయాయి. ఈ సంఘటన జనవరి 22, సోమవారం నాడు జరిగింది. అట్టుపట్టి ప్రాంతంలో డ్రైనేజీ పనిలో భాగంగా జరుగుతున్న తవ్వకాలలో భాగంగా ఇళ్లు కూలిపోయాయి. 
 
ఈ క్రమంలో ఓ కొత్త ఇల్లు నేలపై కూలిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తెలియరాలేదు. తవ్వకం ప్రక్రియను ప్రారంభించే ముందు నివాసితులందరినీ ఇళ్ల నుండి ఖాళీ చేయించారా అనేది అస్పష్టంగా ఉంది. 
 
ఈ వీడియోలో, బహుళ అంతస్తుల భవనం నేలపై పడిపోవడం కనిపించింది. కొత్తగా కట్టుకున్న ఇల్లు ఇలా చెల్లాచెదురుగా పడిపోవడంపై ఆ ఇంటి వారు ఆందోళన చెందారు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది.