సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (09:16 IST)

కామాంధులతో కలిసి ఖాకీలు యువతి శీలాన్ని దోచుకున్నారు.. ఎక్కడ?

కామాంధుల నుంచి యువతులకు భద్రత కల్పించాల్సిన రక్షక భటులు చివరకు భక్షక భటులుగా తయారవుతున్నారు. తాజాగా కొందరు కామాంధులతో కలిసి ఓ యువతి శీలాన్ని దోచుకున్నారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలన

కామాంధుల నుంచి యువతులకు భద్రత కల్పించాల్సిన రక్షక భటులు చివరకు భక్షక భటులుగా తయారవుతున్నారు. తాజాగా కొందరు కామాంధులతో కలిసి ఓ యువతి శీలాన్ని దోచుకున్నారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ జిల్లాలో ఓ మైనర్‌ బాలిక తనపై ఐదుగురు వ్యక్తులు కలిసి అత్యాచారం చేశారు. వారిలో ఇద్దరు పోలీసులు ఉన్నారు. దీంతో బాధితురాలు నేరుగా జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌కు ఫిర్యాదు చేసింది. మంగళవారం సీఎం సిద్దిబాత్‌ కార్యక్రమానికి వచ్చిన బాలిక సీఎంతో తన గోడు వెల్లబోసుకుంది. 
 
కామాంధులతో కలిసి తన శీలాన్ని ఇద్దరు ఖాకీ కామాంధులు కూడా దోచుకున్నారంటూ బోరున విలపిస్తూ చెప్పింది. ఎంతో ప్రాధేయపడినా పోలీసులు వినిపించుకోలేదంటూ వాపోయింది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు. 
 
ఎంజీఎం పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జీ, డీఎస్‌పీ ర్యాంకు అధికారితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారం జరిపారని.. అంతేకాకుండా వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తున్నారని సీఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన జంషెడ్‌పూర్ ఎస్పీ అనూప్ బర్తార్యా స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.