1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (13:26 IST)

విజయ్‌ని అప్పుడే రాజకీయాల్లోకి రమన్నాను.. INDIA కూటమిలో భాగం: కమల్

Kamal Haasan
Kamal Haasan
రాజకీయ రంగంలో పూర్తిస్థాయి రాజకీయ నాయకులు లేరని సినీనటుడు, మక్కల్ నీది మయ్యం నాయకుడు కమల హాసన్ అన్నారు. చెన్నైలోని ఆళ్వార్ పేటలో మక్కల్ నీది మయ్యం ఏడో వార్షిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కమల్ హాసన్.. మక్కల్ నీది మయ్యం ప్రారంభించినందుకు తనకే నష్టమని అన్నారు. 
 
తాను కోపంతో రాజకీయాల్లోకి రాలేదని, బాధతో రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. విధాన సమావేశాల మధ్య టార్చ్ పట్టుకోవడం తనకు ఇష్టం లేదని కమల్ హాసన్ తెలిపారు. దేశ పౌరసత్వం ప్రమాదంలో పడిందని, తమ డిమాండ్ల కోసం రైతులు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారని కమల్ అన్నారు. 
 
రైతులకు శత్రువుల మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇస్తోందని కమల్ హాసన్ విమర్శించారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలకు సమానంగా నిధుల పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్న కమల్ హాసన్ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీతో మక్కల్ నీది మయ్యమ్ కూటమిలో భాగమని ప్రకటించారు.
 
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేందుకు డీఎంకే కూటమిలో తమ పార్టీ భాగమని కమల్ హాసన్ చెప్పారు. ఎన్నికల విజయాల కంటే ప్రజలకు వారి కర్తవ్యాన్ని గుర్తు చేయడం, నాయకత్వానికి సిద్ధం చేయడం చాలా ముఖ్యం. మనమందరం కలిసి ప్రజాస్వామ్య రథాన్ని లాగాలనే భావాన్ని కలిగించడం అవసరమైన రాజకీయ కార్యాచరణ. మక్కల్ నీది మయ్యం లాంటి ప్రజాస్వామిక శక్తుల ఆవశ్యకత రోజురోజుకూ పెరుగుతోంది. కుల, మత వర్గాలు ఉన్నంత కాలం, ఉత్తరాది, దక్షిణాది బ్రతుకుతున్నంత కాలం అవినీతి, కొనసాగుతున్నంత వరకు మన పోరాటం విశ్రమించదు... అని కమల్ హాసన్ తెలిపారు. 
 
అలాగే సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రంపై కమల్ హాసన్ మాట్లాడుతూ.. విజయ్‌ను తాను ముందుగానే రాజకీయాల్లోకి రావాల్సిందిగా పిలుపునిచ్చానని తెలిపారు. సినిమాలను వదులుకుని విజయ్ రాజకీయాల్లోకి రావడం అతని నిర్ణయం అంటూ కమల్ చెప్పారు.