ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (17:50 IST)

ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌కు నిప్పంచిన కస్టమర్.. కారణం అదే? (video)

OLA
OLA
ఇటీవల కొనుగోలు చేసిన ఇ-స్కూటర్‌కు సర్వీసింగ్ సంతృప్తికరంగా లేకపోవడంతో కర్ణాటకలోని కలబురగిలోని ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌కు నిప్పుపెట్టినందుకు 26 ఏళ్ల కస్టమర్‌ని పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. కలబురగిలో వృత్తిరీత్యా మెకానిక్ అయిన మహ్మద్ నదీమ్ ఈ-స్కూటర్‌ను ఆగస్టు 2024లో కొనుగోలు చేశారు. స్కూటర్‌లో సమస్యలను ఎదుర్కొన్న తర్వాత, అతను దానిని చాలాసార్లు సర్వీస్ కోసం తిరిగి ఇచ్చాడు.
 
సర్వీసింగ్‌ సంతృప్తికరంగా లేదు. దీంతో ఆగ్రహానికి గురైన నదీమ్ మంగళవారం పెట్రోలు తీసుకొచ్చి షోరూములోని ఆరు బైక్‌లకు నిప్పంటించాడు అని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. షోరూమ్‌కు రూ.850,000 నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.