సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (13:56 IST)

రాఖీభాయ్‌లా కావాలనుకున్నాడు.. నలుగురిని చంపేశాడు..

KGF Killer
KGF Killer
మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు రాఖీభాయ్‌లా కావాలని నలుగురిని హతమార్చాడు. కేజీఎఫ్ రాఖీభాయ్‌లా అవ్వాలనుకున్నాడు. అంతే నలుగురు సెక్యూరిటీ గార్డులను హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన శివప్రసాద్.. సెక్యూరిటీ గార్డులను ముందు రాడ్‌తో వారి తలపై వేటు వేసి.. తర్వాత బండరాయితో మోది చంపేవాడు. 
 
అయితే పోలీసులు ఇతనిని అరెస్ట్ చేశారు. విచారణలో కేజీఎఫ్ సినిమాలో రాఖీభాయ్‌లా అయ్యేందుకు తాను ఈ హత్యలు చేసినట్లు నిందితుడు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.