సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:49 IST)

రామభక్తులకు బంపర్ ఆఫర్.. క్విజ్‌లో గెలిస్తే.. విమానంలో అయోధ్యకు..

రామభక్తులకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రామాయణంపై నిర్వహించే ఓ క్విజ్‌లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.. అయోధ్యకు విమానంలో వెళ్లండి అని ఆ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రామాయణంపై జనరల్ నాలెడ్జ్ పోటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ అధికారిక ప్రకటన వెల్లడించింది.
 
ఇందులో గెలిచిన వాళ్లను విమానంలో అయోధ్యకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. అయితే ఈ పోటీ ఎప్పుడు నిర్వహిస్తారు, ఎంతమందిని ఎంపిక చేస్తారన్నది మాత్రం చెప్పలేదు.
 
ఇండోర్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషా ఠాకూర్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రామచరితమానస్‌లోని అయోధ్య కాండపై జనరల్ నాలెడ్జ్ పోటీని ఆమె ప్రారంభించారు.