ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 20 నవంబరు 2024 (23:00 IST)

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

pawan kalyan
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ రాష్ట్రంలో తిరిగి ఎన్డీయే కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మొత్తం ఐదు ఎగ్జిట్ పోల్స్ - మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీస్, టైమ్స్ నౌ-జెవిసి, పోల్ డైరీ- మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని కూటమి ఆధిక్యాన్ని అంచనా వేయగా, మూడు - దైనిక్ భాస్కర్, పి-మార్క్, లోక్‌షాహి మరాఠీ-రుద్ర- హంగ్ హౌస్‌ వచ్చే అవకాశం వుందని అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి.
 
pawan kalyan
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అధికార మహాయుతి కూటమి - BJP, శివసేన, NCP (అజిత్ పవార్ వర్గం), ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA)- కాంగ్రెస్, శివసేన(UBT), NCP (శరద్ పవార్ వర్గం) మధ్య పోటీ ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు (105), శివసేన (56), కాంగ్రెస్ (44) స్థానాలు గెలుచుకున్నాయి.
 
Maha Exit polls
కాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించిన నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి పవన్ ప్రభావం ఆ నియోజకవర్గాల్లో వున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద మహారాష్ట్రంలో రెండు కూటమిల మధ్య హోరాహోరీ పోటీ వున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది.