బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (20:27 IST)

పామును మెడలో వేసుకుని సెల్ఫీకి ఫోజులు... యువకుడి మృతి

snake
స్మార్ట్ ఫోన్ పుణ్యమా అంటూ సెల్ఫీల పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఎక్కడపడితే అక్కడక్కడ సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
 
అయితే సెల్ఫీల పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కందుకూరులో ఓ యువకుడు ఏకంగా పాముతో సెల్ఫీ దిగబోయి ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పామును మెడలో వేసుకుని సెల్ఫీకి ఫోజులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. అది అతడిని కాటు వేసింది. 
 
అతని అరుపులు విన్న స్థానికులు యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఇక్కడ చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.