1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2024 (11:38 IST)

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

crime
జైలులో ఉన్న సమయంలో తన భార్య తన తమ్ముడిని పెళ్లిచేసుకుందనే కోపంతో తన సోదరుడి ఏడు నెలల పసికందును హత్య చేసిన నేరానికి ఇటీవల జైలు నుండి బయటికి వచ్చిన ఒక వ్యక్తి మళ్లీ అరెస్టు అయ్యాడు. 
 
అరెస్టయిన వ్యక్తిని బీహార్‌కు చెందిన విజయ్ సహాని (30)గా గుర్తించారు. పసికందును హత్య చేసిన కొన్ని గంటల తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. విచారణలో నిందితుడు విజయ్ గత నాలుగేళ్లుగా చైన్ స్నాచింగ్ కేసులో గురుగ్రామ్‌లోని భోంద్సీ జైలులో ఉన్నట్లు తేలింది.
 
విజయ్ జైలులో ఉన్నప్పుడు, అతని భార్య అతని తమ్ముడిని వివాహం చేసుకుంది. తరువాత ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న జైలు నుంచి విజయ్ బయటకు వచ్చాడు.
 
ఏప్రిల్ 25న నిందితుడికి, అతని విడిపోయిన భార్య మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కోపోద్రిక్తుడైన విజయ్ పసికందును నేలపై విసిరి చంపి పరారయ్యాడు. 
 
పసికందును ఆసుపత్రికి తరలించగా అప్పటికే పసికందు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.