శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (14:21 IST)

దేశ ఆర్మీ కంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువ : మోహన్ భగవత్

దేశ ఆర్మీ కంటే రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువగా ఉందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంల

దేశ ఆర్మీ కంటే రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువగా ఉందని ఆ  సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ 'యుద్ధం కోసం సిద్ధపడాలంటే ఆర్మీకి ఆరు నుంచి ఏడు నెలల సమయం పడుతుంది. అదే ఆరెస్సెస్‌ కార్యకర్తలకు అయితే కేవలం మూడురోజుల సమయం చాలు... ఇది వారి సామర్థ్యం' అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఇంకా మాట్లాడుతూ, దేశం తరపున పోరాడాల్సి వస్తే రాజ్యాంగానికి లోబడి తమ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుకు వస్తారని ఆయన ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సైనికులుకాకున్నా వారిలా క్రమశిక్షణతో దేశం కోసం త్యాగం చేయడానికి సంతోషంగా ముందుకు వస్తారని ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సత్ప్రవర్తనతో వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితం గడుపుతున్నారని ఆయన వివరించారు.