సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (11:49 IST)

అల్లుడి సోదరుడిని వివాహం చేసుకున్న అత్త.. చివరికి ఏమైందంటే?

ఇంటికి అల్లుడిగా వచ్చిన సోదరుడితో అత్త అక్రమ సంబంధం నెరపింది. ఇంకా అతడినే వివాహం చేసుకుంది. ఈ ఘటన పంజాబ్‌లో సంచలనం సృష్టించింది. పంజాబ్, గుర్దాస్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, పంజాబ్‌లో 37 ఏళ్ల మహిళ తన 18 ఏళ్ల కుమార్తెను 21 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం చేసింది. ఆ యువ జంట ఇప్పుడిప్పుడే కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.
 
అయితే ఆ 37 మహిళ చేసిన కార్యం సంచలనానికి దారితీసింది. ఆమె తన అల్లుడికి సోదరుడైన 22ఏళ్ల వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. తన అల్లుడి సోదరుడిని ప్రేమించడం ద్వారా తన భర్తకు దూరమైంది. ఇంకా విడాకులు కూడా పుచ్చుకుంది. ఆపై తనకంటే 15 ఏళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకుంది. 
 
అయితే వీరి ప్రేమ వ్యవహారం అల్లుడికి కూతురికి తెలియ రావడంతో బంధువులతో  పాటు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో 37 ఏళ్ల మహిళ.. తాను వివాహం చేసుకున్న వ్యక్తితో కలిసి భద్రత కల్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై ఈ నెల 31వ తేదీన విచారణకు రానుంది. అన్నాదమ్ముళ్లు, తల్లిని కుమార్తెను వావివరుసలు లేకుండా వివాహం చేసుకోవడం పెను సంచలనానికి దారితీసింది.