శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 నవంబరు 2023 (16:12 IST)

ఇండోర్‌లో ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి

Heart
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందిన ఉదంతం అందరినీ కలిచివేసింది. ఇండోర్‌లోని డెయిలీ కాలేజీ స్కూల్‌లో మొదటి తరగతి చదువుతున్న వెహాన్ జైన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో మృతి చెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఇండోర్ కంచన్ బాగ్‌లో నివసిస్తున్న రాహుల్ జైన్ ఆరేళ్ల ఏళ్ల కుమారుడు మాస్టర్ వెహాన్ జైన్ డైలీ కాలేజీ స్కూల్‌లో మొదటి తరగతి చదువుతున్నాడు. కానీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేసింది.