శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (10:13 IST)

మరోసారి తాత అయిన బిలియనీర్ ముఖేశ్ అంబానీ

Mukesh-Nita Ambani
ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముఖేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా మెహతా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ జంటకు ఇది రెండో బిడ్డ. 2020 డిసెంబర్‌లో శ్లోక అబ్బాయికి జన్మనిచ్చింది. 
 
ప్రస్తుతం ఈమె రెండోసారిగా అమ్మాయికి జన్మనిచ్చిందని ముఖేశ్ అంబానీ సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. దీంతో అంబానీకి, శ్లోక దంపతులు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
మరోవైపు మనవరాలు పుట్టిన సందర్భంగా ముఖేశ్ అంబానీ తన కుటుంబసభ్యులతో కలిసి ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.