శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 జులై 2018 (08:53 IST)

నీ కుమార్తెను రేప్ చేస్తా.. ఒక్కసారి పంపిస్తావా?

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ప్రియాంకా చతుర్వేది ఉన్నారు. ఈమెకు భర్త, కుమార్తె, కుమారులు ఉన్నారు. అయితే, ట్విట్టర్ వేదికగా ఈమెకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ గుర్తు తెలియని వ్యక్తి

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ప్రియాంకా చతుర్వేది ఉన్నారు. ఈమెకు భర్త, కుమార్తె, కుమారులు ఉన్నారు. అయితే, ట్విట్టర్ వేదికగా ఈమెకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్‌లో ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. నీ కుమార్తెను పంపిస్తే రేప్ చేస్తానంటూ అందులో హెచ్చరించాడు. దీనిపై ప్రియాంకా చతుర్వేది ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ హెచ్చరిక ట్వీట్ గిరీష్‌కే1605 అనే హ్యాండిల్‌ నుంచి వచ్చింది.
 
ఈ ట్వీట్ చేసిన వ్యక్తి ట్విట్టర్లో రాముడి ఫోటోతో పాటు జై శ్రీరామ్ అనే నినాదాలు రాసి ఉన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. గిరీష్‌కేకు ప్రియాంక చతుర్వేదీ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. తన కుమార్తె పట్ల తప్పుడుగా మాట్లాడడం పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ రకంగా మాట్లాడినందుకు సిగ్గుపడాలన్నారు. లేకపోతే నీకు రాముడే భవిష్యత్తులో తగిన గుణపాఠం నేర్పుతాడని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఫిర్యాదుపై వేగంగా స్పందించిన ముంబై పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు.