శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (10:53 IST)

లఖీంపూర్‌ఖేరిలో ఉద్రిక్తత-ప్రియాంక గాంధీ అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ఖేరిలో ఉద్రిక్తత నెలకొంది. లఖీంపూర్ వెళ్తుండగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్‌ఛార్జీ ప్రియాంక గాంధీని సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఐదు గంటల పాటు ప్రియాంక గాంధీ వాద్ర హౌస్ అరెస్ట్‌లో గడిపారు. అనంతరం ఆమె పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నారు. 
 
పార్టీ నాయకుల కారులో లఖీంపూర్‌కు బయలుదేరారు. రైతుల మీదనుంచి దూసుకెళ్లిన కేంద్రమంత్రి తనయుడి కారు ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంక గాంధీ వెళుతున్నట్లు సమాచారం.
 
గాయపడిన రైతులను పరామర్శించేందుకు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) నేత రాకేష్‌ తికాయత్‌ లఖింపూర్‌ ఖేర్‌ జిల్లాకు చేరుకున్నారు. మొదట గ్రామస్తులు, స్థానికులతో చర్చలు జరుపుతామని అనంతరం భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తికాయత్‌ అన్నారు. తికాయత్‌తో పాటు పలువురు మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. మంత్రి అజరు మిశ్రాని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.