మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 జూన్ 2019 (11:49 IST)

టీనేజ్ అమ్మాయితో చిందులేసిన ఎమ్మెల్యే.. ఇష్టం లేకపోయినా కౌగిలించుకుని?

టీనేజ్ అమ్మాయితో హోటల్ రూమ్‌లో అశ్లీల నృత్యం చేసిన ఎమ్మెల్యే బాగోతం బయటికి వచ్చింది.  మణిపూర్‌లో ఇన్‌స్పెక్షన్ కోసం వెళ్లిన ఎమ్మెల్యే హోటల్‌లోని రూమ్‌‌లో టీనేజీ అమ్మాయితో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల రాష్ట్రీయ జనతా దళ పార్టీ ఎమ్మెల్యే యదువన్ష్ కుమార్ యాదవ్ బీహార్ అసెంబ్లీలో కీలక పదవిలో వున్నారు. 
 
ఈ నేపథ్యంలో మణిపూర్‌లో ఓ పర్యవేక్షణ నిమిత్తం వెళ్లారు. అక్కడ పర్యవేక్షణను పక్కనబెట్టి.. ఎమ్మెల్యేలు బసచేసిన హోటల్ గదికి ఓ టీనేజ్ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమె భుజంపై చెయ్యేసి.. కౌగిలించుకుని డ్యాన్స్ చేశారు. 
 
ఎమ్మెల్యేతో డ్యాన్సు చేయడం ఏమాత్రం ఇష్టపడని ఆ టీనేజ్ అమ్మాయి భుజంపై ఎమ్మెల్యే చెయ్యేడాన్ని వ్యతిరేకించింది. అయినా ఆ టీనేజ్ అమ్మాయి బలవంతంగా కౌగిలించుకుని ఎమ్మెల్యే డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.