ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (14:13 IST)

మరో పది విమానాలకు బాంబు బెదిరింపులు...

indigo
భారత్‌కు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ప్రయాణికులతో పాటు విమానాశ్రయ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇండిగో సంస్థకు చెందిన పది విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు ఆ సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపులు వచ్చిన విమాన సర్వీసుల్లో దేశీయంగా నడిచే విమాన సర్వీసులతో పాటు.. విదేశీ సర్వీసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ వంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. కాగా, ఈ వారంలో ఇప్పటివకు దాదాపు వందకు పైగా ఇండిగో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెల్సిందే. 
 
ఇదే అంశంపై ఇండిగో సంస్థ అధికారులు స్పందిస్తూ, "జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు రావడంతో మా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను తరలించి.. తనిఖీలు నిర్వహిస్తున్నాము'' అని ఇండిగో ఉన్నతాధికారులు వెల్లడించారు.