శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (17:40 IST)

విదేశీ తబ్లీగీ ప్రతినిధులపై పదేళ్ళ నిషేధం : కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న తబ్లీగి జమాత్ కార్యకర్తలపై కేంద్రం కన్నెర్రజేసింది. ముఖ్యంగా, టూరిస్ట్ వీసాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన రెండు వేల మందికిపైగా విదేశీ తబ్లీగి ప్రతినిధులను బ్లాక్‌లిస్టులో ఉంచింది. వీరంతా పదేళ్ళపాటు భారత్‌లో అడుగుపెట్టందుకు వీలులేదు. 
 
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కస్ మసీదుసులో మార్చి నెలలో ఇస్లాం మత ప్రార్థనా కార్యక్రమం జరిగింది. ఇందులో 2 వేల మందికి పైగా తబ్లీగీ ప్రతినిధులు పాల్గొన్నారు. దీనికి దేశంలోని నలు మూలల నుంచి కూడా అనేక మంది హాజరయ్యాురు. వీరి ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించినట్టు కేంద్రం గుర్తించింది. 
 
దీంతో ఈ మర్కజ్‌ సదస్సుకు హాజరైన 2 వేల మంది విదేశీ తబ్లీగీలను కేంద్రం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. వీరెవ్వరూ పదేళ్లపాటు భారత్‌కు రాకుండా చర్యలు తీసుకుంటోంది. వీరంతా వీసా నిబంధనలు ఉల్లంఘించి మతపరమైన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
 
టూరిస్ట్ వీసాపై భారత్‌లోకి వచ్చి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా మతపరమైన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం వీసాలు ఉల్లంఘించిన 960 మంది విదేశీ తబ్లీగీలపై కేంద్రం ఇపుడు చర్య తీసుకుంది.
 
కాగా, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా సదస్సు జరిగిన భవనంలోనే ఉండిపోవడం ప్రమాదకరంగా మారింది. మార్చి 22 జనతా కర్ఫ్యూ తర్వాత సదస్సు జరిగిన భవనం నుంచి అధికారులు వేలాది మంది తబ్లీగీలను బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. 
 
మర్కజ్ సదస్సుకు హాజరైన తబ్లీగీలకు వారి కుటుంబీకులకు కరోనా సోకింది. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. వీరందరినీ ట్రేస్ చేయడానికి ప్రభుత్వ యత్రంగానికి చాలా సమయం పట్టింది. ఈలోగానే కరోనా మహమ్మారి మరింత విజృంభించింది.