1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (17:13 IST)

ఆస్పత్రిలోకి వచ్చిన చిరుతపులి.. భయభ్రాంతులకు గురైన రోగులు

leopard
మహారాష్ట్రలో ఓ చిరుత పులి ఆస్పత్రిలోకి ప్రవేశించింది. దీంతో ఆ ఆస్పత్రిలోని రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ రాష్ట్రంలోని నందుర్బార్ జిల్లాలోని ఈ ఘటన జరిగింది. 
 
ఈ జిల్లాలోని షహాదా ప్రాంతంలోని ఆదిత్య ప్రసూతి, కంటి ఆస్పత్రికి వచ్చిన ఓ కార్మికుడు చిరుతపులిని చూసి భయంతో కేకలు వేయడంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆ అరుపులకు చిరుత పులి ఓ మూలన నక్కింది. 
 
సమాచారం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది తలుపులను మూసివేసి చిరుతపులిని బందీగా చేశాడు. దీంతో రోగులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత పులిని బంధించి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆస్పత్రిలోని రోగులకు గుండె ఆగిపోయినంత పని అయింది.