1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (19:50 IST)

తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. షాకైన టీటీడీ

Leopard
తిరుమలలో ఇటీవల చిరుతపులుల సంచారం అధికమైన సంగతి తెలిసిందే. చిన్నారిపై చిరుత దాడి జరిగిన తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చిరుతపులుల కదలికలను పర్యవేక్షించడానికి ట్రాప్ కెమెరాలను ఉపయోగించింది. ఇది నాలుగు చిరుతలను పట్టుకోవడానికి సాయపడింది. 
 
అయితే, తాజాగా తిరుమల నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించింది. ఈ చిరుత కెమెరాలో కనిపించింది. ఇది చూసిన ఆలయ సెక్యూరిటీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చిరుతను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో అదనపు బోనులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 
 
తిరుపతి కొండ ఉన్న శేషాచలం అడవుల్లో 100కు పైగా చిరుతలు ఉన్నాయి. ఫుట్ పాత్ ప్రాంతంలో వీటిలో 10 చిరుతలు సంచరిస్తున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది.