శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2023 (12:08 IST)

అలిపిరి బాటలో 300 కెమెరాలు.. 50 కెమెరాల్లో రికార్డైన చిరుతల సంచారం

Leopard
శ్రీవారిని దర్శించుకునేందుకు గాను భక్తులు ఉపయోగించే అలిపిరి నడిచేబాటలో చిరుతల సంచారం అధికంగా వున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ బాలికను చిరుత పొట్టనబెట్టుకుంది.

ఆపై జరిగిన ఆపరేషన్‌లో రెండు చిరుతలు చిక్కాయి. అలాగే భక్తులను చిరుతల బారి నుంచి కాపాడేందుకు అలిపిరి నడిబాటలో తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి అటవీశాఖాధికారులు 30 మంది పర్యవేక్షణ కెమెరాలను అమర్చారు. అయితే ఇందులో నిన్న ఒక్కరోజులో 50 కెమెరాలలో చిరుతల సంచారం నమోదైంది.
 
50 కెమెరాల్లో చిక్కిన చిరుత బాలికను చంపినదేనా? లేక చిరుతలు ఎక్కువగా ఉన్నాయా? అనే దానిపై అధికారులు ముమ్మరంగా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల్లో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం రికార్డయింది. 
 
ఈ సందర్భంగా తిరుపతి వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఫుట్‌పాత్‌పై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. నిఘా కెమెరాల సాయంతో అడవుల్లో సంచరిస్తున్న చిరుతలను గుర్తించి ఫుట్‌పాత్‌లపై నుంచి తరిమికొట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రజలు, భక్తులు సహకరించాలని పిలుపునిచ్చారు.