1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోడీ - అమిత్ షా

narendra modi
గుజరాత్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు తమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఆయన ఎన్నికల సంఘాన్ని అభినందించారు. 
 
ఓటు వేసిన తర్వాత ప్రధాని మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు నా అభినందనలు, అలాగే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘానికి కూడా నా అభినందనలు" అని అన్నారు. 
 
మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఆయన భార్యతో కలిసి అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. విరంఘమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ పోటీ చేస్తున్న హార్థిక్ పటేల్ సైతం ఓటు వేశారు.