శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (19:24 IST)

70వేల మంది జాబ్ లెటర్స్.. ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్!

Modi
దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేళా సందర్భంగా 70వేల మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం జాబ్ లెటర్‌లను వర్చువల్‌గా అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి ఈ లెటర్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్ మారనుందని మోదీ అన్నారు. వచ్చే 25 సంవత్సరాలు భారత్‌కు చాలా కీలకమని ప్రధాని వ్యాఖ్యానించారు.
 
ఉపాధి అవకాశాలు, పౌరుల తలసరి ఆదాయం పెరగనుందని మోదీ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బ్యాంకింగ్ రంగం భారీ విధ్వంసానికి గురైందని మోదీ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న వేళ... 70వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వ జాబ్స్ రావడం గొప్ప గౌరవమని ప్రధాని అన్నారు.