సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (15:01 IST)

మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. శరద్ పవార్‌కు ప్రేమలేఖ

sarad pawar
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు రాత్రి ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌కు ఐటీ తాఖీదుల రూపంలో ప్రేమ లేఖ పంపించారు. ఈ విషయాన్ని శరద్ పవర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ముఖ్యమంత్రి షిండేగా ప్రమాణం చేయగానే తనకు ప్రేమలేఖ అందిందంటూ పవార్ ట్వీట్ చేశారు.
 
గత 2004, 2009, 2014, 2019 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో తాను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లకు సంబంధించిన ఐటీ శాఖ నుంచి తనకు ప్రేమలేఖ అందిందని చెప్పారు. కొందరు వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారని, అఫిడవిట్లకు సంబంధించిన సమాచారమంతా తన వద్ద ఉందని చెప్పారు.
 
అలాగే, హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో ముఖ్యమంత్రి పీఠం కోసం ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలిపారంటూ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలకు శరద్ పవార్ గట్టిగానే కౌంటరిచ్చారు. హిందుత్వ సిద్ధాంతం ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయలేదని కేవలం అధికారం కోసమే తిరుగుబాటు చేశారంటూ విమర్శించారు.