జమ్మూ కశ్మీర్ 370, 35A: కుర్తా చింపుకున్న PDP ఎంపి
జమ్మూ కశ్మీర్ 370, 35A ఆర్టికల్స్‌ను రద్దు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించగా.. విపక్షాలు తీవ్ర నిరసనను చేపట్టాయి. ఇందులో భాగంగా… జమ్మూ కశ్మీర్ లోని మెహబూబా ముఫ్తి పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభలో తీవ్ర గందరగోళం చేయడంతో సభ నుంచి బయటకు పంపివేశారు.
ఒకరు నజీర్ అహ్మద్ లావే కాగా, మరొకరు ఎంఎం ఫయాజ్. కేంద్రం ప్రతిపాదించిన బిల్లులకు నిరసనగా PDP MP నజీర్ అహ్మద్ తన కుర్తాను చింపుకున్నారు.
రెండుగా జమ్మూ కశ్మీర్ విభజన... కేంద్రం బిల్లు
370, 35A ఆర్టికల్ రద్దు చేయడానికి ప్రతిపాదించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. రాజ్యసభలో మాట్లాడిన ఆయన జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయనున్నట్లు తెలిపారు. జమ్ము కశ్మీర్‌ను లడక్, జమ్ము కశ్మీర్‌లుగా విభజించనున్నట్టు చెప్పారు.
అయితే జమ్ము కశ్మీర్‌కు అసెంబ్లీ ఉంటుందని, లడక్‌లో అసెంబ్లీ ఉందడని తెలిపారు. ఆర్టికల్ 370, 35Aని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అమిత్ షా ప్రతిపాదనతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మరో గంటలో లోక్ సభలో మాట్లాడనున్నారు అమిత్ షా.