మహిళపై మరో మహిళ అత్యాచారం కేసు పెట్టవచ్చా?
దేశ అత్యున్నత న్యాయస్థానం మహిళపై మరో మహిళ అత్యాచారం కేసు పెట్టవచ్చా? అనే సమస్యను పరిశీలించేందుకు అంగీకారం తెలిపింది. ఓ వింత కేసుపై సుప్రీం స్పందించింది. 61 ఏళ్ల పెద్ద కోడలే అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేయడంతో .. ఈ సమస్యను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
కానీ ఈలోగా నిందితురాలిని అరెస్టు చేయకూడదంటూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సమస్యపై నాలుగు వారాల్లో వైఖరి చెప్పాలంటూ పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. నిందితురాలైన వితంతువు పెద్ద కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. బాధితురాలికి, అతడికి వర్చువల్ విధానంలో వివాహమైంది. పెళ్లి తరువాత ఆమె అత్తవారింట్లోనే ఉంటోంది.