శుక్రవారం, 1 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (09:07 IST)

03-12-2023 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం..

Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక బ॥ షష్ఠి సా. 6.23 ఆశ్రేష రా. 9.24 ఉ.వ.9.08 ల 10.53. సా.దు. 3.51 ల 4.35.
ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అధికారులు, పనివారలతో సమస్యలెదురవుతాయి. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి.
 
వృషభం :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహరాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనుల విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు.
 
మిథునం :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆధ్మాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. మీ పట్టుదల వల్ల శ్రమాధిక్యత, ధననష్టం ఎదుర్కుంటారు.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు కార్మికుల వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రముఖుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించిన జార విడచుకుంటారు.
 
సింహం :- రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం వాయిదాపడుతుంది. తలకు మించిన భాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓప్పిగా వ్యవహరించండి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం సేకరిస్తారు.
 
కన్య :- మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. గృహమునకు కావలసిన విలువైన వస్తువులు అమర్చుకొవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటి పైనే శ్రద్ధ వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి చికాకులతప్పవు.
 
తుల :- బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలటంతో పొదుపు సాధ్యం కాదు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం :- స్థిరచరాస్థుల విషయంలో ఏకీభావం కుదరదు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి. బ్యాంకు అపరిచిత వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండట మంచిది.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు, ప్రైవేటు సంస్థల్లో వారికి అధికారులతో అవగాహన కుదరదు. పాత మిత్రుల కలయికతో గతస్మృతులు జ్ఞప్తికి వస్తాయి. ప్రత్యర్థుల తీరును గమనించి తదనుగుణంగా మెలగండి. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలటంతో పొదుపు సాధ్యంకాదు. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరుతాయి.
 
మకరం :- విద్యార్ధులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. కొంతమంది మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు. అయినవారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
కుంభం :- ఉద్యోగస్తుల ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళకువ అవసరం. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
మీనం :- ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలు రావచ్చు. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. మందులు, ఫ్యాన్సీ, వ్యాపారులకు కలిసివచ్చేకాలం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.