బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (11:14 IST)

8వ తరగతి వరకూ స్కూళ్లు బంద్... ఎక్కడ?

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మార్చి 31 వరకూ స్కూళ్లను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 24 నుంచి 31 వరకూ 8 వ తరగతి వరకూ ఇకపై క్లాసులను నిర్వహించరు.

అలాగే ఈ తరగతులకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
 
కాగా యూపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 542 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 142 కేసులు కేవలం లక్నోలోనే నమోదయ్యాయి. లక్నోలో గత  మూడు రోజులుగా వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

కాగా రానున్న హోలీతో పాటు పంచాయతీ ఎన్నికల సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.