గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (15:01 IST)

అక్క చనిపోతే.. చెల్లెలు కూడా నేనూ వస్తున్నానంటూ...?

90 ఏళ్ల వయస్సులోనూ ఆ అక్కాచెల్లెళ్లు విడిపోలేదు. చిన్నప్పటి నుంచి ప్రాణప్రదంగా పెరిగిన అక్కాచెల్లెళ్లను 90 ఏళ్ల వయస్సులో విడదీసేందుకు మృత్యువు వెతుక్కుంటూ వచ్చింది. అయితే వారి బంధాన్ని చూసి మృత్యువే చ

90 ఏళ్ల వయస్సులోనూ ఆ అక్కాచెల్లెళ్లు విడిపోలేదు. చిన్నప్పటి నుంచి ప్రాణప్రదంగా పెరిగిన అక్కాచెల్లెళ్లను 90 ఏళ్ల వయస్సులో విడదీసేందుకు మృత్యువు వెతుక్కుంటూ వచ్చింది. అయితే వారి బంధాన్ని చూసి మృత్యువే చలించింపోయేలా విషాద ఘటన చోటుచేసుకుంటుంది.


అక్క మృతి చెందిన విషయాన్ని విని తట్టుకోలేక చెల్లెల్లు కూడా నేనూ వస్తున్నా అన్నట్లు అక్కవైపు చూస్తూ ప్రాణాలు కోల్పోయింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. నడింపల్లి గ్రామానికి చెందిన కొడాలి సీతారావమ్మ (94)కు ఇద్దరు చెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నారు. సీతారావమ్మకు మేనమామతో వివాహమైంది. చెల్లెలు పావులూరి సత్యవతి (90)కి భర్త చనిపోవడంతో 40 ఏళ్ల నుంచి అక్క దగ్గరే ఉంటోంది. అక్కంటే సత్యవతికి ప్రాణం. తల్లిదండ్రుల కంటే అక్క పట్లే ఆప్యాయం, ప్రేమగా వుండేది. 
 
గత కొన్ని రోజులుగా సీతారావమ్మ అస్వస్థతతో బాధపడుతోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం చెల్లెలిని చూస్తూ ఆమె చేతిలో చెయ్యి వేసి కన్నుమూసింది. అక్క మృతిని తట్టుకోలేని సత్యవతి కూడా నిమిషం వ్యవధిలోనే ప్రాణం వదిలింది. దీంతో సీతారావమ్మ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదం నెలకొంది.