శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

జమ్మూకాశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గత 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. అనంత్‌నాగ్ జిల్లాలోని కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో కాశ్మీర్ పోలీసులతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని హతం చేశారు. 
 
ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడిచిన 48 గంటల్లో నాలుగు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ ఆరుగురులో ఒక ఉగ్రవాది ఇటీవల బిజ్బెహరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏఎస్ఐ మహ్మద్ అష్రఫ్‌ను హత్యచేసిన ఉగ్రవాది ఒకరు ఉన్నాడు.