శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (09:10 IST)

కుల్గామ్‌‍లో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు కాల్చిచంపేశాయి. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కుల్గామ్ జిల్లాలోని రెద్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగివున్నారనే పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందంలో ముష్కరులు కాల్పులు జరిపారు. 
 
దీంతో భద్రతా బలగాలు ముష్కరులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. వీరు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది.